మా నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ సాయం చేశారు: మంచు లక్ష్మీ
కాకతీయ, సినిమా డెస్క్: తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సాయం చేశారని సినీనటి మంచు లక్ష్మీ అన్నారు. రజనీకాంత్ చిత్రపరిశ్రమకు వచ్చి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మీ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు. తన తండ్రి, రజనీకాంత్ మంచి స్నేహితులని..చిన్నప్పుడు పుట్టిన రోజులకు ఆయన తప్పకుండా వచ్చేవారంటూ గుర్తు చేసుకున్నారు. ఆయనకు తమతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్నారు. రజనీకాంత్ ఎంత గొప్ప వ్యక్తో తమకు...