ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది దుర్మరణం..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం వేళ విషాదం నెలకొంది. పశ్చిమబెంగాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది దుర్మరణం చెందారు. తెల్లవారుజామున 7.30గంటలకు యాత్రికులతో బీహార్ వెళ్తున్న బస్సు బర్ద్వాన్ ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో 35 మందికి తీవ్ర గాయలైనట్లు తెలిపారు. గాయపడినవారికి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. మరణించినవారంతా బీహార్ లోని చంపారన్ జిల్లా మోతీహారికి చెందిన వారిగా గుర్తించినట్లు...