వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!!

కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొర్రూరు వైపు నుండి వరంగల్ వెళుతున్న లారీ, వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ బలంగా ఢీకొట్టింది. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యారు. క్షతగాత్రులను108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా సుమారు 2 కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 60 మంది ప్ర‌యాణికులు ఉన్నారు....