ఓటు చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది..కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్..!!

కాకతీయ, బయ్యారం: రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటు చోరీ చేసినట్టు సుప్రీం కోర్టు తీర్పుతో రుజువైందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్ అన్నారు. శుక్రవారం గణేష్ మాట్లాడుతూ.. బీహార్ లో 65 లక్షల తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని,వాటిని తొలగించడానికి గల కారణాలను తెలియజేయాలని, దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ ఓటు చోరీ చేస్తున్న విషయాన్నీ మన కాంగ్రెస్ నాయకులు వెలికి తీసి ప్రజల ముందు పెట్టారన్నారు. ఇది దేశ ప్రజల హక్కులపై దాడనీ అన్నారు. ఇది రాజ్యాంగంపై దాడని, బిజెపి...