ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయుల కృషిని గుర్తించాలి: TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరించాలనీ TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రైవేట్ ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కోసం, హక్కుల సాధన కోసం , సమస్యల పరిష్కారం...