గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్.. 25.8 కిలోల ఎండు గంజాయి స్వాధీనం..!
కాకతీయ, హనుమకొండ : హన్మకొండ పోలీసులు, తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆపరేషన్‌లో గంజాయి స్మగ్లర్ల నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కుమార్పల్లి ఎస్ టి. జోసెఫ్ హైస్కూల్ సమీపంలో మహీంద్రా ఎక్స్ యూ వి కారులో గంజాయి తరలిస్తున్న నిందితులను టీ ఎస్ నాబ్ సీఐ శ్రీకాంత్, ఎస్‌ఐ పరశురాములు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 25 కిలోల 800 గ్రాముల ఎండుగంజాయి, ఐదు సెల్‌ఫోన్లు, మహీంద్రా ఎక్స్ యూ వి...