గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైంది : పొంగులేటి

కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని, మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని...