బాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..!!
కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో పంద్రాగస్టు సందర్భంగా కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీ.కే.నాయుడు స్మారక బాడ్మింటన్ టోర్నమెంట్స్‌ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలకు దేశంలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఒలింపిక్స్, అంతర్జాతీయ వేదికలపై పతకాల సంఖ్య తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 55 లక్షల కోట్ల బడ్జెట్‌లో క్రీడలకు కేవలం 2161 కోట్లు, తెలంగాణకు 17 కోట్లు మాత్రమే కేటాయించడమే...