హరే క్రిష్ణ హరే హరే.. సుదర్శన చక్రపై మోదీ మాస్ స్పీచ్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. దేశ రక్షణ రంగంలో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 2035నాటికి సుదర్శన చక్ర పేరుతో ఒక అత్యాధునిక ఆయుధ వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రధాని వెల్లడించారు. ఈ శక్తివంతమైన సాంకేతిక రక్షణ కవచం దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు పూర్తి భద్రతను కల్పిస్తుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శ్రీక్రిష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం...