బీసీ బిల్లును త్వరగా ఆమోదించాలని కేంద్రానికి గోల్కొండ కోటపై నుంచి విజ్ఞప్తి చేస్తున్నా: రేవంత్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. భారత ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచంతో పోటీపడి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింస పద్ధతిలో మహా సంగ్రామాన్ని...