పడకేసిన పారిశుద్ద్యం..!!
కాకతీయ, ములుగు: వర్షకాలంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పల్లెలలో పారిశుద్ద్యం పై ప్రత్యేక దృష్టి సారించి పల్లెలలోని ప్రజలు సీజనల్ వ్యాదుల భారీన పడకుండా చర్యలు తీసుకోవాలసిన గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వ్యాదుల భారీన పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న పరిస్థితి రోజురోజుకు పెరుగుతుంది. గ్రామాన్ని పారిశుద్యం బాటలో నడిపించవలసిన అధికారులు తమ కంటి ముందే కుప్పలు, తెప్పలుగా చెత్త పెరుకుపోతున్న పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మేజర్ గ్రామ...