మాటలకు అందని విషాదం.. కశ్మీర్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: జమ్ముకశ్మీర్ లో చషోటి గ్రామంలో బుధవారం క్లౌడ్ బరస్ట్ పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా పదుల సంఖ్యలో జనం మరణించారు. దాదాపు 200 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మృతుల సంఖ్య 46 నుంచి 60కి చేరుకుంది. మరణించినవారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. మరణించినవారి సంఖ్య మరింత అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నది....