భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా అదనపు కలెక్టర్ అనిల్
కాకతీయ, బయ్యారం: గార్ల,డోర్నకల్, మరిపెడ మండలాలు మహబూబాబాద్ జిల్లా లో ఆదివారం జిల్లా (ఇన్చార్జి) కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్,జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం జిల్లాలో వరదల వలన సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ స్థాయి నుండి ప్రత్యేక అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది వరకు క్షేత్రస్థాయిలోనే ఉంటూ స్థానిక పరిస్థితులను గమనిస్తూ ముందస్తు చర్యలు తీసుకొని సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం, మంత్రి...