కోర్టుల భారం తగ్గించే సాధనం మధ్యవర్తిత్వం..!!

కాకతీయ, హనుమకొండ : మధ్యవర్తిత్వం ద్వారా కోర్టుల కేసులను గణనీయంగా తగ్గించవచ్చని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. సామ్ కోషి పేర్కొన్నారు. సుబేదారిలోని డి.సి.సి. బ్యాంక్‌లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల న్యాయవాదుల కోసం 40 గంటల శిక్షణా కార్యక్రమం వివరణ సమావేశం జరిగింది. శాంతి.. సామరస్యానికి దోహదం: జస్టిస్ సామ్ కోషి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఇరువైపుల మధ్య శాంతి, సామరస్యాన్ని నెలకొల్పుతుందని తెలిపారు....