కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి వేగవంతం చేయాలి: టీజీఐఐసీ విసి ఎండి శశాంక ఐఏఎస్
కాకతీయ, గీసుగొండ: కాకతీయ టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని టిజిఐఐసి విసి ఎండి శశాంక ఐఏఎస్ అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణా ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శశాంక ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్శనలో ఆయన పార్కు ప్రాంగణంలోని మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు, వరద నీటి ఎద్దడి నివారణకు నిర్మిస్తున్న నాల పనులను, ఆర్ఓ ప్లాంట్ పనులను,...