రైతులపై కాంగ్రెస్ పగ తీర్చుకుంటోంది: హరీశ్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ సర్కార్ పగ తీర్చుకుంటోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, రైతుల గురించి తెలియదన్నారు హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి విలువ తెలియదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల మీద కోపం ఉంటే..రైతులకు శిక్ష వేస్తారా అంటూ ప్రశ్నించారు. బురద రాజకీయాల కోసం వరద నీళ్లను సముద్రంలోకి వదలకండని..కాళేశ్వరం కూలిందని గోబల్స్ ప్రచారం చేస్తున్నారని...