18 నుంచి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల రెండ‌వ విడ‌త శిక్ష‌ణ ప్రారంభం: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను అక్టోబ‌ర్ 2వ తేదీ గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి మొద‌టి విడ‌త స‌ర్వేయ‌ర్ల శిక్ష‌ణ పూర్త‌యింద‌ని రెండవ విడ‌త శిక్ష‌ణ 23 జిల్లా కేంద్రాల్లో ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అభ్యర్ధులు ఆయా జిల్లాల్లో 18వ తేదీ ఉద‌యం 10 గంటల లోపు స‌ర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కు...