కన్నీళ్లు మిగిల్చిన నీళ్ల గుండం..9 ఏళ్ల క్రితం వాగులో అన్న,నేడు ఏడుబావులలో తమ్ముడు మృతి
కాకతీయ , బయ్యారం: నీటి గండం, విహారం పేరిట ఆ కుటుంబంలో విషాదం మిగుల్చాయి. తొమ్మిదేళ్ల క్రితం పెద్ద కుమారుడు వాగులో కొట్టుకుపోయి మరణించగా.. చేతికి అంది వచ్చిన రెండవ కుమారుడు జలగుండంలో చిక్కుకొని మరణించడంతో తల్లిదండ్రులకు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఏడు బావుల జలపాతం వద్ద చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం జెన్నారం గ్రామానికి చెందిన పామర్తి శ్రీను, లక్ష్మి దంపతుల రెండవ కుమారుడు పామర్తి ప్రేమ్ కుమార్ (23) తన...