సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు..!!
కాకతీయ, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 21వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ప్రజాప్రతినిధులు,...