జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం : దాస్యం వినయ్ భాస్కర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నిమిత్తం మోతీనగర్‌లో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మోతీ నగర్, రెహ్మత్ నగర్ డివిజన్ల పార్టీ ఇంచార్జ్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష. హైదరాబాద్‌ను విశ్వనగరాల సరసన నిలబెట్టిన ఘనత కేటీఆర్ అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అకాల మరణం పార్టీకి...