కోస్తాంధ్రలో భారీ వర్షాలు..పాఠశాలలకు సెలవు, రైళ్లు దారి మళ్లింపు..!!

కాకతీయ, అమరావతి: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు, ఎల్ఎన్ పేట, వజ్రపుకొత్తూరు, అముదాలవలస, కొత్తూరు, లావేరు, కంచిలి మండలాల్లో భారీ వర్షం పడుతోంది. నాగావళి, వంశధార, నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. కలెక్టరే ట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్...