ములుగు జిల్లాలో భారీ వర్షాలు ..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ డాక్టర్ శబరీష్

కాకతీయ, ములుగు : ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి, ఐపీఎస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు వరద ముప్పు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ హెచ్చరించారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారులపై దాటవద్దని, శిధిలమైన ఇండ్లలో నివసించవద్దని, తడిగా ఉన్న కరెంట్...