100 పడకల హాస్పిటల్‌లో ప్లేట్లెట్స్ మిషన్ వెంటనే వినియోగంలోకి తేవాలి..!
కాకతీయ, భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ (100 పడకల హాస్పిటల్)లో ప్లేట్లెట్స్ మిషన్‌ను వెంటనే వినియోగంలోకి తేవాలని ఏం ఆర్ పీ ఎస్ - టీ ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనే రెండు సంవత్సరాల క్రితం ప్లేట్లెట్స్ మిషన్ కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఒక ప్యాకెట్ ప్లేట్లెట్స్‌కు సుమారు 15 వేల...