ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు..250కి పైగా విమానాలు రద్దు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. భారత వాతావరణ సంస్థ సైతం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు 250కిపైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు తెలిపారు అధికారులు. ఉదయం 9గంటల నుంచి 9.50గంటల ప్రాంతంలో 8 విమానాల దారి మళ్లించినట్లు తెలిపారు. విమాన సర్వీసులు సగటున...