శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..ఫ్లైట్ లో 67 మంది ప్రయాణికులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరుస విమాన ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజుకో విమాన వార్త సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ఎక్కడోచోట ఏదొక విమానం ప్రమాదానికి గురవుతూనే ఉంది. ప్రమాదాలు, సాంకేతిక లోపాలు విమానాల్లో బయటపడుతున్న విమానాలకు సంబంధించి కంపెనీలు ఏమాత్రం చలించడం లేదు. ప్రజల ప్రాణాలు కూడా లెక్కనట్లు వ్యవహరిస్తూ..కార్పొరేట్ బుద్ధిని చాటుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలెట్ సాంకేతిక...