నిషేధం కాదు.. నియంత్రణే..? ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుపై అమిత్‌షాకు AIGF లేఖ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ అరాచకాలు ఎక్కువయ్యాయి. దీన్ని అరికట్టేందుకు ఆన్ లైన్ గేమింగ్ బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ సిద్ధమయ్యింది. ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు లేఖను రాసింది. ఆన్ లైన్ బెట్టింగ్స్ ను అరికట్టేందుకు కేంద్రం తీసుకువచ్చే బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందంటూ ఏఐజీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అమల్లోకి వస్తే తమ...