గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేశాడు.. అసలు ఎందుకిలా జరిగింది?
కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్ లోని అధికారిక నివాసంలో బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 35ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదట అతను కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు చేపట్టారు....