మహిళలకు డిప్యూటీ సీఎం శుక్రవారం కానుక..10వేల మందికి చీరల పంపిణీ..!!

కాకతీయ, అమరావతి: పిఠాపురం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం మహిళలకు కానుక ప్రకటించారు. 10వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయాలని పవన్ నిర్ణయించారు. పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. 22వ తేదీ ఉదయం 5గంటల నుంచి ఈ ఆలయంలో వ్రతాలు ప్రారంభమవ్వనున్నాయి. మొత్తం 5 విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. ఒక్కో...