భార్యను చంపి “దృశ్యం ” స్టోరీ చెప్పాడు.. బండారం బయటపడిందిలా..!!
కాకతీయ, క్రైమ్ డెస్క్: భార్యను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టి..వారం రోజులుగా ఊర్లో లేమని నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఈ మూవీలోని హీరో. అలాంటి ఘటన ఇప్పుడు నిజ జీవితంలో చోటుచేసుకుంది. తన భార్య శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి ఆమె మరొకరితో వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..యూపీలోని ఆమ్రోహాకు చెందిన షబాబ్ అలీ పెయింటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య ఫాతిమాకు మరొకరితో వివాహేతర సంబంధం...