వైన్స్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్
వైన్స్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్ భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు లాటరీ పద్ధతిలో కేటాయింపు కంపెనీలు, భాగస్వామ్య సంస్థలకు అవకాశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 వైన్స్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుండగా, డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సుల కేటాయింపుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై వైన్స్ షాపుల టెండర్లకు దరఖాస్తు రుసుమును గణనీయంగా పెంచారు. ఇప్పటివరకు రూ.2 లక్షలుగా ఉన్న...