జైలులో ఉండగానే రివ్యూ మీటింగ్‌లు పెట్టారు.. కేజ్రీవాల్‌పై కిషన్‌రెడ్డి ఫైర్!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవుల నుంచి తొలగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆరోపణలతో జైల్లోకి వెళ్తే పదవి నుంచి వైదొలగాలని ఆయన అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రివాల్ ఆరు నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు అక్కడే అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారంటూ విమర్శలు చేశారు. జైలు నుంచే పాలన చేసి ప్రభుత్వ యంత్రాంగాన్నిభ్రష్టు పట్టించారంటూ మండిపడ్డారు. తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ జైలుకి వెళ్లిన రాజీనామా చేయలేదన్నారు. ప్రభుత్వాలను కాపాడే నేతలు, పాలకులకు...