సీఎం రేఖాపై దాడి కేసులో సంచలన ట్విస్ట్.. అందుకే దాడి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని వీధి కుక్కలను తరలిస్తున్నారనే కోపంతోని తాను ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి చేశానని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. జంతువు ప్రేమికుడైన తనను ఈ విషయం ఎంతగానో భాదించడంతోపాటు...