మల్లన్న దూకుడు.. ఏకంగా తిరుమల వెంకన్నతోనే పోటి.. హుండీ ఆదాయం ఎంతంటే?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం మల్లన్న ఇప్పుడు తిరుపతి వెంకన్నతో ఆదాయంలో పోటీ పడుతున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు రికార్డు స్థాయికి చేరాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో భక్తుల భక్తి ప్రవాహం మరోసారి హుండీ ఆదాయంలో ప్రతిఫలించింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయాల్లో గత 27 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకనేందకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మడుపులు, ముక్కులే కాకుండా కానుకల రూపంలోనూ చెల్లించుకున్న నగదుతో హుండీలు...