వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడు ఫుడ్ పెట్టారో..సుప్రీం సంచలన తీర్పు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం అందించకూడదని..దీనికోసం నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. రేబిస్ లేదా విపరీత అక్రోశం కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని స్టెరిలైజేషన్ చేసిన అనంతరం విడుదల చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సవరించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ ఆగస్టు...