రేవంత్ సర్కార్ కు మొట్టికాయలు..కాళేశ్వరం రిపోర్టుపై ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టిన కోర్టు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవతకవలపై జస్టిస్ పి.సి ఘోష్ సమర్పించిన రిపోర్టును శాసనసభలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేదా చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ను సూటిగా ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు దాఖలు చేసిన పిటిషన్స్ పై విచారణలో ఇదే కీలకమని..దీనిపై స్పష్టత లేకుండా తామేమీ చెప్పలేమని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది....