పోలీసులపై కత్తితో దాడి చేసిన మందుబాబులు.. పోలీసులకు తీవ్రగాయాలు..!

కాకతీయ, నేషనల్ డెస్క్: ముంబైలో మందుబాబులు రెచ్చిపోయారు. పెట్రోలింగ్ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం...అంత్లటా గార్డెన్ మైదానంలో కొంతమంది గంజాయి తాగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా, పోలీసు హవల్దార్ భలేరావు, కానిస్టేబుల్ సూర్యవంశీ NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్)...