అనంతపురంలో హైటెన్షన్.. దగ్గుపాటి ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు..?

కాకతీయ, అమరావతి: అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలను తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాలు , పరిసర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి గట్టి భద్రతను కల్పించారు. అనంతపురం నగరంలోకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారన్న సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వైపు ఎవరూ...