రెండు రోజుల ముందు నుంచే ఖైరతాబాద్​ గణేశుడి దర్శనం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుగుతాయి. అయితే ఎక్కువ మంది మాత్రం ఖైరతాబాద్ వినియకుడి అంటే ఆసక్తి చూపిస్తుంటారు. మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ఉండటంతో ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహనిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ఈ విగ్రహానికి ప్రస్తుతం ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నాయకత్వంలో రంగులు అద్దుతున్నారు. ప్రతిసంవత్సరం వినాయక చవితికి విఘ్నేశ్వరుడు 69 అడుగుల ఎత్తున శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరనున్నాడు. ఈ...