ఓఆర్ఆర్ చుట్టూ మార్కెట్ ఎలా ఉండనుంది? ప్రభుత్వం ఏం చేయనుంది..?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల, లోపలి భాగంలోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువ సవరణపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీతోపాటు 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో భూముల మార్కెట్ విలువ సవరణపై జిల్లా అదనపు కలెక్టర్ నేత్రుత్వంలో ఉండే కమిటీలు సమావేశం అయ్యాయి. ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న విలువ, సవరణకు ఉన్న అవకాశాల ప్రతిపాదనలపై ఈ కమిటీలు చర్చించి ఆమోదించి ప్రభుత్వానికి పంపించాయి. ముఖ్యమంత్రి స్థాయిలోనూ...