ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి.. ఆశా కార్యకర్తల మహాధర్నాకు మాజీ మంత్రి హరీశ్ రావు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తల మహాధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మిమ్మల్ని గెలిపిస్తే మీకు ఫిక్డ్స్ వేతనం ఇస్తామంటూ ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ఆశా కార్యకర్తలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఆనాడు...