సబ్సిడీ నుంచి స్కూటర్ వరకు.. మహిళా సాధికారతే ప్రాధాన్యం: మంత్రి నారా లోకేష్

కాకతీయ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళలు సరికొత్త మార్గంలో పయనిస్తున్నారు. మెప్మా సహకారంతో స్వయం ఉపాధి పొందుతూ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. చేతిలోని స్మార్ట్ ఫోన్‌ ఉపయోగిస్తూ, ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ సొంతంగా సంపాదిస్తున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు తదితర నగరాల్లో మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సొంత కాళ్లపై నిలబడేందుకు ర్యాపిడో ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్తే’ స్ఫూర్తి మహిళల స్వయం ఉపాధికి తొలి అడుగు ఈ ఏడాది మార్చి 8న,...