విద్యార్థినిపై వీధి కుక్కల దాడి.. ముఖానికి 17 కుట్లు వేసిన వైద్యులు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ లోని ఓ కాలేజీ విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ముఖానికి గాయలయ్యాయి. దీంతో విద్యార్థిని ముఖానికి 17 కుట్లు వేశారు. అలెన్ హౌస్ రుమా కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న 21సంవత్సరాల వైష్ణవి సాహు అనే విద్యార్థిని ఈనెల 20న కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి బయలు దేరింది. అయితే మార్గం మధ్యలో శ్యామ్ నగర్ ప్రాంతంలో కొన్ని వీధికుక్కలు, కోతులు...