ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్ధులు..సీఎం చంద్రబాబును కలిసి సంతోషాన్ని పంచుకున్న స్టూడెంట్స్..!!
కాకతీయ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్‌లో విజయం సాధించిన విద్యార్ధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి... మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో...