ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఫ్రీబస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈస్కీమ్ ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అవుతోంది. ఈ స్కీమ్ వల్ల తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుందని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ముందు మహిళలు వినూత్నంగా ధర్నాకు దిగారు. ఈ స్కీమును ఎత్తివేసి ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలను కూడా అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఫ్రీ ప్రయాణం వల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిందని..నిలబడటానికి కూడా...