గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి ఉంది. కానీ ప్రజావ్యతిరేకత, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతోంది. ఎన్నికలకు జంకుతుండటంతో ప్రస్తుతం పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పరిపాలన ఇంకా సాగుతోంది. కొన్ని నెలలుగా పంచాయితీల్లో పాలన కుంటుపడింది. పంచాయతీలు అభివ్రుద్ధి నోచుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై కసరత్తు...