భారీ వర్షాలతో వణికిపోతున్న పాకిస్తాన్..24 గంటల్లో 17 మంది మృతి

కాకతీయ, నేషనల్ డెస్క్: భారీ వర్షాలు, వరదలతో పాకిస్తాన్ వణికిపోతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల విధ్వంసం నెలకొంది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ వర్షం వల్ల ఎక్కువగా ప్రభావితమైంది. గత 24 గంటల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాల కారణంగా ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం 17 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. జూన్ 26, ఆగస్టు 20 మధ్య పాకిస్తాన్ ప్రారంభ రుతుపవనాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో...