హైదరాబాద్‌లో వర్షాలు.. జంట నగరాల ప్రజలకు అలర్ట్!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: వినాయక చవితి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు పండుగ వాతావరణంలో మునిగిపోతాయి. వీధులన్నీ గణపతి మండపాలతో కళకళలాడుతాయి. మార్కెట్లలో పూజా సామగ్రి కొనే జనం రద్దీగా కనిపిస్తారు. ఇళ్లలో పూజల కోసం చిన్న గణేశ విగ్రహాలను కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.అయితే, సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరంలో పండుగ సమయానికి రోడ్లు మరింత రద్దీగా మారుతాయి. దీనికి తోడు, వర్షం కూడా చేరితే పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం విశాఖపట్నం సమీపంలో...