80 శాతం విద్యార్థుల హాజరు తప్పనిసరి: విద్యాశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం 80 శాతం దాటాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్, కేజీబీవీ ప్రిన్సిపాళ్ల తో గురువారం కలెక్టరేట్ స‌మావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా అన్ని మండలాల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరును సమీక్షించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరు 80% దాటాలని, ఆదిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షం వంటి కారణాలవల్ల...