తెలంగాణ ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం.. రంగంలోకి బండి సంజయ్..!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం అవ్వడంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా రక్షణశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు బండి. రాష్ట్రంలో వరద తీవ్రత, సహాయక చర్యల ఆవశ్యకత గురించి వివరించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారిందని..ఇదే హెలికాప్టర్ల రాకకు ప్రధాన అడ్డంకిగా మారిందని రక్షణ శాఖ అధికారులు బండి సంజయ్ కు...