గౌడ కమ్యూనిటీ ఐక్యత.. అభివృద్ధి దిశగా జీజీఈఏ కొత్త తీర్మానాలు.!!

కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లిలోని సంఘమిత్ర డిగ్రీ & పీజీ కళాశాలలో గౌడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (జీజీఈఏ) భూపాలపల్లి యూనిట్ ఆధ్వర్యంలో తొలి సన్నాహక సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న గౌడ కమ్యూనిటీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘానికి మద్దతు తెలిపారు. సమావేశంలో గౌడ కమ్యూనిటీ ఐక్యత, అభివృద్ధి, యువత ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ముఖ్యంగా.. చదువులో, పోటీ పరీక్షల్లో, క్రీడల్లో...